న్యూటన్ గమన నియమాలు తెలుసుకున్న పెద్దిరాజు కదులుతున్న సిటీ బస్ నుంచి దిగి ఒక్కసారిగా ఆగిపోకుండా, బస్ తో కొద్దిదూరం పరుగెత్తి బ్యాలెన్స్ చేసుకోగలగడం ఈ సిద్ధాంతం వివరిస్తుంది.
ఆదర్శాల సిద్ధాంతం
సమరూప మూలకాల సిద్దాంతం
సాధారణీకరణాల సిద్ధాంతం
విచక్షణా సిద్దాంతం
ఎందుకు? ఏమిటి? ఎలా? వంటి ప్రశ్నలను అడిగే విద్యార్దులలో ఇది ఎక్కువ
సహజ సామర్ధ్యం
కుతూహలం
అభిరుచి
వైఖరి
తండ్రి వ్యాపారాన్ని ఆసక్తిగా గమనించిన రాజు, తన తండ్రి లేని సమయంలో కిరాణా షాపును సమర్ధవంతంగా నిర్వహించగలుగుతున్నాడు. ఈ విషయాన్ని నేర్చుకోవడాన్ని వివరించే సిద్ధాంతం
సాంఘిక అభ్యసనం
యత్నదోష అభ్యసనం
అంతరదృష్టి అభ్యసనం
నిబంధనోద్దిత అభ్యసనం
కోటివిద్యలూ కూటికొరకే అన్న నానుడి క్రింది అంశాల మధ్య సంబంధాన్ని తెలియచేస్తుంది.
అభ్యసనం – ప్రేరణ
అభ్యసనం – అవసరం
ప్రేరణ – అవసరం
సంసిద్ధత – ప్రేరణ
మిత్రుని ఇంటివద్ద ఏనుగు బొమ్మను చూసిన రాజీవ్, ఇంటికి వచ్చి మట్టితో ఏనుగు బొమ్మను చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఆకృతుల పునరుత్పాదన
శబ్ధ ప్రమాణం
నమూనాలను తయారుచేయడం
కథనాలు
నిర్నిబంధిత ఉద్దీపన లేకుండానే నిబంధిత ఉద్దీపన ప్రయోగిస్తే కొన్నిసార్లు తరువాత నిబంధిత ప్రతిస్పందన ఆగిపోతుంది. ఇది ఏ సూత్రానికి సంబంధించిన అంశము?
అయత్నసిద్ధస్వాస్థ్యం
విచక్షణము
సామాన్యీకరణ
విలుప్తీకరణము
గ్రూప్ – 2 పరీక్ష ఇంటర్య్వూకు వెళ్లిన శ్యామ్, ఇంటర్య్వూ అనంతరం అలసటగా కన్పించాడు. ఇతనికి కలిగిన అలసట ఎ.శారీరక అలసట బి.మానసిక అలసట సి.నరాల అలసట
బి మాత్రమే
ఎ మాత్రమే
ఎ మరియు బి
బి మరియు సి
సిటీకి వెళ్లిన వెంకన్నకు, తన బాల్య మిత్రుడు శేఖర్ కనిపించాడు. కుశల ప్రశ్నల తరువాత వారి బాల్య స్మృతులు నెమరువేసుకుంటున్నారు. ఇది
స్వల్పకాలిక స్మృతి
సంసర్గస్మృతి
నిష్క్రియాత్మక స్మృతి
దీర్ఘకాలిక స్మృతి
రోడ్డు ప్రమాదానికి గురైన భార్గవ్, తన పేరు, వివరాలను చెప్పలేకపోతున్నాడు. అతనిలో కలిగిన విస్మృతి