ఆదర్శ, భరత్ లు ఇద్దరూ కలసి రూ. 4000, రూ. 6000 పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని నడిపారు. వారు సంవత్సరం వ్యాపారం చేసిన తరువాత వారికి వచ్చిన రూ. 1500 లాభాన్ని పంచుకోగా, భరత్ పొందిన వాటా
ఆకాశ్, భార్గవ్, చందులు కలసి రూ. 2500, రూ. 1800, రూ. 2000 లతో సంక్రాంతి రంగుల అమ్మకం వ్యాపారం ప్రారంభించారు. వారం రోజుల అనంతరం ఆకాశ్ అవసరార్ధం రూ. 700 తీసుకున్నాడు. భార్గవ్ రూ. 400, చందులు రూ. 300 పెట్టుబడులను కలిపి వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేశారు. సీజన్ ముగిసిన తరువాత వచ్చిన లాభం రూ. 945 పంచుకోగా చందుకు వచ్చిన వాటా
అరుణ్, వరుణ్ ల పెట్టుబడుల మొత్తం రూ. 65,000 సంవత్సర ఆదాయం రూ. 20,000 అందులో రూ. 7,000 ఖర్చులకు పోను మిగిలింది పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకోగా, అరుణ్ కంటే, వరుణ్ కి రూ. 1000 అధికంగా వచ్చింది. అయితే వారి పెట్టుబడులు
సునీల్, వేణు లు రూ. 6000, రూ. 8000 లతో వ్యాపారం ప్రారంభించారు. ఆరు నెలల తరువాత వేణు వ్యాపారాన్ని వదిలి వెళ్లెను. ఆ సమయంలో భగవాన్ రూ. 16000 లను తన వాటాగా చేర్చి వ్యాపారంలో చేరెను. సంవత్సరాంతానికి వారికి వచ్చిన లాభం రూ. 63000 అయితే భగవాన్ వాటా
ఒక వ్యాపారంలో ఫణి, షీలా వరుసగా రూ. 24,000 మరియు రూ. 30,000 పెట్టుబడిగా పెట్టారు. ఆరు నెలల అనంతరం ఫణి రూ. 4000 పెట్టుబడిని ఉపసంహరించినట్లయితే సంవత్సరాంతంలో వచ్చిన రూ. 1,04,000 లాభంలో షీలా వాటా
రామయ్య మరియు గోపాలం వరుసగా రూ. 2000 మరియు రూ. 3000 పెట్టుబడితో ఒక వ్యాపారమును ప్రారంభించిరి. సంవత్సరాంతమున వారికి వచ్చిన లాభమును వారు ఏ నిష్పత్తిలో పంచుకోవాలి?
దీపక్ ప్రారంభించిన వ్యాపారంలో దినేష్ రూ. 25,000 పెట్టుబడితో రెండు నెలల తర్వాత చేరాడు. వారు లాభాన్ని 3:5 నిష్పత్తిలో పంచుకొన్నట్లయితే దీపక్ వ్యాపారంలో ఉంచిన పెట్టుబడి ఎంత?
ఆర్తి, కీర్తి లు వ్యాపార భాగస్వాములు. మొత్తం మూలధనంలో 1/4 వంతు 15 నెలలపాటు ఆర్తి వాటాగా ఉండగా, తన వాటాగా మొత్తం లాభంలో 2/3 వంతు కీర్తికి లభించింది. కీర్తి పెట్టుబడి ఎంతకాలం వాడారు?
ఒక పచ్చిక బయలును నాలుగు పాలవర్తకులు అద్దెకు తీసుకొన్నారు. మూడు మాసాలు 24 ఆవులను రామయ్య, ఐదు మాసాలు 10 ఆవులను సోమయ్య, నాలుగు మాసాలు 35 ఆవులను కనకయ్య, మూడు మాసాలు 21 ఆవులను దానయ్య మేపుకున్నారు. అద్దెలో రామయ్య వాటా రూ. 720 అయితే పచ్చిక బయలు మొత్తం అద్దె ఎంత?
డేవిడ్, గోపి అనువారి పెట్టుబడుల మొత్తం రూ. 40,400. సంవత్సరాంతమున వచ్చిన మొత్తం లాభం రూ. 10,000. పెట్టుబడుల నిష్పత్తిలో గాక సమానంగా పంచుకున్నచో డేవిడ్ రూ. 50 నష్టం వస్తుంది. ఒక్కొక్కరి పెట్టుబడులు ఎంత?