నిముషాల ముల్లు, గంటల ముల్లును ఒకసారి దాటడానికి వాస్తవ సమయంలో 63 నిముషాలు సమయం తీసుకుంటున్నది. అయితే ఒక రోజులో ఆ గడియారం ప్రదర్శించే అదనపు లేదా తగ్గింపు సమయం ఎంత?
జూన్ 12 వ తేదీ ఉదయం గం. 8.00 కు సరిచేసిన గడియారం 13వ తేదీ మధ్యాహ్నం గం. 2 కు 15 నిముషాలు తక్కువ చూపిస్తున్నది. అయితే తరువాత రోజు ఉదయం ఈ గడియారము 12 గం. చూపినపుడు యదార్ధ వేళ ఎంత ఉంటుంది
ఒక గడియారము ఆదివారం ఉదయం 11.00 నకు 9 నిముషాలు నెమ్మదిగా నడుస్తున్నది అని గమనించెను. అయిన అదే గడియారము మంగళవారము ఉదయం 11.00 నకు 6 నిముషాలు వేగముగా నడుస్తున్నట్లు గమనించెను. అయిన ఆ గడియారము ఏ సమయము వద్ద సరియైన సమయమును చూపించెను?
ఒక గడియారము ప్రతి 3 గం. లలో 10 సె. అదనంగా తిరుగుతున్నది. సోమవారం ఉదయం 4.00 గంటలకు సరిగ్గా సమయాన్ని అమర్చి ఉంటే, అది మంగళవారం సాయంత్రం గం.7.00 కు సూచించే సరియైన సమయాన్ని గుర్తించండి